సవ్యసాచి సినిమా టీజర్ అక్టోబర్ 1న

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 11:31 AM

 సవ్యసాచి సినిమా టీజర్ అక్టోబర్ 1న

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో చైతు సరసన బాలీవుడ్ మోడల్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు కంటే ముందే దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమాను శైలజా రెడ్డి అల్లుడు సినిమా కోస్మ ఆపారు. అయితే మారుతి డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా అంతగా మెప్పించలేదు.

సినిమాలో మారుతి మార్క్ కామెడీ ఉన్నా రొటీన్ సబ్జెక్ట్ అయ్యే సరికి ఆడియెన్స్ కు రుచించలేదు. అందుకే అది థియేటర్ ల నుండి ఇలా వెళ్తుందో లేదో సవ్యసాచి సినిమా తెచ్చే ప్లాన్ వేశాడు నాగ చైతన్య. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేయడం జరిగింది. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు నాగ చైతన్య. మరి సవ్యసాచి అయినా చైతు కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చే హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.Untitled Document
Advertisements