రైతన్నలపై జల ఫిరంగులన దాడి !!

     Written by : smtv Desk | Tue, Oct 02, 2018, 05:21 PM

 రైతన్నలపై జల ఫిరంగులన దాడి !!

ఉత్తరప్రదేశ్‌ , అక్టోబర్ 02: దేశానికి ఇంత తిండిపెట్టే రైతన్నలపై ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించడం కాదు కదా కనీసం పరిశీలించడానికీ నిరాకరిస్తున్నాయి. ఒకపక్క నీరవ్ మోదీ, మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలకు వేవవేలకోట్లు అప్పులిచ్చి, వారిని విదేశాలకు పంపిస్తున్న ప్రభుత్వాలు దేశానికి వెన్నెముక అయిన రైతన్న విషయంలో మాత్రం నానా అకృత్యాలకూ తెగబడుతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం గాంధీ జయంతి రోజు దేశ రాజధానికి పాద యాత్ర చేపట్టిన రైతులపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అకృత్యాలకు తెగబడ్డారు. దీంతో దేశ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గిట్టుబాటు ధర, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మార్కెట్ వసతులు తదితర డిమాండ్ల సాధన కోసం 30 వేలమంది రైతులు యూపీలోని హరిద్వార్ నుంచి ఈ రోజు ఢిల్లీకి పాదయాత్రగా బయల్దేరారు. అయితే వారిని చివరులోనే పోలసులు అడ్డుకున్నాడు. బారికేడ్లు అడ్డం పెట్టి, జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కాల్పులు కూడా జరిపారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. రైతులు వస్తున్నారని తెలిసిన కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలసులను పెద్ద సంఖ్యలో మోహరించింది. 144 సెక్షన్ కూడా విధించింది. కాగా తమ సమస్యలపై రైతులు ఉత్తరప్రదేశ్‌ మంత్రులతో జరిపిన చర్చలు నాయకులతో చర్చలు ఫలించకపోవడంతో రైతులు ఢిల్లీ బాట పట్టారు.

Untitled Document
Advertisements