స్టేట్ రౌడీలో బిగ్ బాస్ విన్నర్

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 11:08 AM

స్టేట్ రౌడీలో  బిగ్ బాస్  విన్నర్

హైదరాబాద్ ,అక్టోబర్ 03: బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ గా కౌశల్ కెరియర్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటుగా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ గా మారాక ఏకంగా హీరోగానే చేస్తానని కౌశల్ ఆర్మీతో చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ లో అతని ఆట తీరు.. పోరాడే తత్వం చూసి బయట దర్శకులు అతనికి అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వారిలో బోయపాటి శ్రీను కూడా ఉన్నారని అన్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను, రాం చరణ్ కలిసి చేస్తున్న సినిమాలో కౌశల్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సరైన వ్యక్తి కోసం వెతుకుతుండగా కౌశల్ గురించి తెలుసుకున్న బోయపాటి , అతన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. స్టేట్ రౌడీ టైటిల్ ప్రచారంలో ఉన్న చరణ్ సినిమాలో కౌశల్ ఉంటే కచ్చితంగా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ అవకాశం నిజమే అయితే కౌశల్ కూడా నటుడిగా మెయిన్ లీగ్ లోకి వచ్చేసినట్టే.

Untitled Document
Advertisements