సిరిసిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:16 PM

సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోగా మరొకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో రామ్ పూర్ కు చెందిన కందుకూరి అనిల్, గీత దంపతులు తమ ఇద్దరు కుమారులు సృజన్, సూరజ్ లతో కలిసి ఇన్నోవా కారులో హైదరాబాద్‌ వెళుతుండగా బైపాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఒక కంటెయినర్ వాహనం అదుపుతప్పి ఇన్నోవా కారుపై దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తండ్రి అనిల్, కొడుకులు సృజన్, సూరజ్ ఇద్దరు అక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన గీతను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. కంటెయినర్ వాహనం డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతని నిర్లక్ష్యానికి ఒక కుటుంబం బలైపోయింది.

Untitled Document
Advertisements