వివాదాల్లో చిక్కుకున్న సర్కార్

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 06:04 PM

వివాదాల్లో చిక్కుకున్న సర్కార్

తమిళనాడు, నవంబర్ 08: మురగదాస్ , విజయ్ కాంబినేషన్ లో వొచ్చిన చిత్రం సర్కార్. ఈ దీపావళి సందర్భంగా తెలుగు , తమిళంలో విడుదలైన ఈ చిత్రం వివాదాలతో మునిగితేలుతుంది. ముఖ్యంగా జయలలిత పాత్ర పేరుతో అల్లుకున్న కోమలవల్లి పాత్ర వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంలో ఓ పాత్రకు జయలలిత అసలు పేరైన కోమలవల్లి పేరును పెట్టడం, ఆ పాత్ర అధికారం కోసం తండ్రిని స్వయంగా హత్య చేసినట్టు చూపించడంపై అన్నాడీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి.

కోమలవల్లి పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్, విదేశాల్లో ఉన్న వేళ మోడ్రన్ డ్రస్సులను ధరించి, ఇండియాలో దిగగానే, నిండుగా, సంప్రదాయ చీరల్లో కనిపించడం, జయలలిత తన తొలినాళ్లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ కనిపించిన హావభావాలనే చూపించడం అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. సీఎంగా ఉన్న తన తండ్రి, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతే, ఆయన చనిపోతేనే పార్టీ నిలుస్తుందన్న ఉద్దేశంతో, కోమలవల్లి స్వయంగా మాత్రలిచ్చి హత్య చేసినట్టు చూపించారు. దీనికి పలు వర్గాల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రోజు తమిళనాడులో కొన్ని ప్రదేశాల్లో సినిమాని థియేటర్ లో ఆడనివ్వకుండా చేస్తున్నారు. కాగా పలు చోట్ల సినిమా పోస్టర్లను తగల పెడుతున్నారు. కోమలవల్లి చేసిన కొన్ని సీన్లను తొలగించాలని లేకపోతే సినిమా డైరెక్టర్ పై, అలాగే హీరో, నిర్మాత పై కూడా కేసు పెడతామని మండిపడుతున్నారు.

Untitled Document
Advertisements