కాంగ్రెస్ నుండి వరుసగా జారుకుంటున్న నేతలు

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 01:38 PM

కాంగ్రెస్ నుండి వరుసగా జారుకుంటున్న నేతలు

హైదరాబాద్, నవంబర్ 17: ముందస్తు ఎన్నికల సందర్భంగా తెరాసకు వ్యతిరేఖంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామ్యమైన తెదేపా పార్టీ బొల్లం మల్లేష్ యాదవ్ నుండి టికెట్ ఆశించిన ఆయనికి పార్టీ నుండి టికెటు ని కేటాయించక పోయేసరికి నిరాశకు గురై తెరాస కండువా కప్పుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
''నా లాంటి నాయకులకు అన్యాయం జరగొద్దని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నన్ను ఆదరించారు. కేసీఆర్‌కు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలకు సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’ అని మల్లయ్య అన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కోదాడ యువశక్తిని వెంటబెట్టుకున్న మల్లయ్య యాదవ్‌కు స్వాగతమంటూ సంతోషం వ్యక్తం చేశారు. అందరు కలిసి పోరాడి ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

మల్లయ్య యాదవ్ గత ఎన్నికల్లో టీటీపీ నుంచి పోటీ చేసి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మవతి‌రెడ్డి‌పై తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈసారి కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశించిన మల్లయ్యకు టికెట్ రాలేదు. కోదాడ నుంచి ఈసారీ పద్మావతే పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అ స్థానంలో ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. మల్లయ్య ఆ సీటును ఆశించి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కోదాడ టికెట్ ఇస్తే.. అక్కడ గులాబీ జెండా ఎగరవేస్తారని టీఆర్‌ఎస్ నాయకులు, అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements