భయపెట్టడానికి రెడీ అయిన అంజలి

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 01:52 PM

భయపెట్టడానికి రెడీ అయిన  అంజలి

హైదరాబాద్, నవంబర్ 16: హారర్ సినిమాలలో తనకంటూ వొక పేరు ని తెచ్చుకున్న అంజలి తమిళంలో ప్రధాన పాత్రగా లిసా అనే హారర్ థ్రిల్లర్ మూవీ నిర్మించబడింది . ఇదే తరహాలో తెలుగులో కూడా ఈ సినిమా అదే పేరుతో రాబోతుంది. డైరెక్టర్ రాజు విశ్వనాథ్ వహించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం వొక కీలకమైన పాత్రను పోషించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది వరుకు ఎప్పుడు రాని విధంగా హారర్ థ్రిల్లర్ లో వస్తున్న ఫస్ట్ 3డీ సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా నుంచి వొక టీజర్ ను వదిలారు.ఊరికి చివరిలో వున్న వొక పాడుబడిన ఇంట్లోకి అంజలి వెళ్తుంది. ఆ ఇంట్లో జరిగే సంఘటనలు ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలుసుకుని ఆమె భయంతో వణికిపోతోంది. ఆ ఇంట్లో రాత్రి 10 తరువాత ఎలాంటి పరిస్థితుల్లోనూ లైట్ వేయరాదు అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హారర్ జోనర్లో సినిమాలు చేయడం అంజలికి కొత్త కాదు .. కనుక ఈ సినిమాలో ఆమె తన పాత్రలో జీవించిందనే విషయం తెలిసిపోతూనే వుంది.





Untitled Document
Advertisements