ఎన్నికల కమీషన్ మరో కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Sun, Nov 18, 2018, 06:40 PM

ఎన్నికల కమీషన్ మరో కీలక నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల సందర్భంగా నేతలంతా ప్రచారంలో మునిగిపోతున్నారు. అయితే ఈ ప్రచార క్రమంలో నిర్వహణకు ఖర్చు చేసే వ్యయం మీద ఎన్నికల కమిషన్ షరతు విధించింది. ఎంతపడితే అంత ఖర్చు చెయ్యటానికి వీల్లేదు. ప్రతీ పైసా లెక్క పద్దులతో వుండాలని ఖచ్చితంగా చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో ఎన్నికల వ్యయానికి సంబంధించి 20 వేల వరకు నగదును చెల్లించే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు కుదించినట్టు తెలిపారు జిల్లా ఈసీ అధికారి దానకిషోర్. రూ.10 వేలు దాటితే అకౌంట్‌ పే చెక్కు రూపంలో చెల్లించాలని వెల్లడించారు.

నామినేషన్‌ దాఖలు చేసిన రోజునే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని, ఆ రిజిస్టర్‌లో నామినేషన్‌కు అయిన ఖర్చు, ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చు వివరాలను అందులో రాయాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమ పేరుపై ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్‌ తెరవాలని, ప్రచార లావాదేవీల చెల్లింపులన్నీ ఆ అకౌంట్‌ ద్వారా సంబంధిత వ్యక్తులకు లేదా సంస్థలకు అకౌంట్‌ పే చెక్కు ద్వారా ఆర్టీజీఎస్‌, డ్రాఫ్ట్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో చెల్లించాలని సూచించారు.





Untitled Document
Advertisements