మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఫరూక్

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 01:58 PM

మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఫరూక్

అమరావతి, నవంబర్ 20: వైద్య ఆరోగ్య, మైనారిటీ శాఖ మంత్రిగా ఎన్ఎండీ ఫరూక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " పేదల సంక్షేమం కోసం వైద్య సేవలకు ప్రభుత్వం ఏటా రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తోంది అని స్వైన్‌ ఫ్లూ కేసులు కర్నూల్ జిల్లాలో ఎక్కువగా నమోదుయ్యాయని తెలిపారు. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు కల్పించాలని నిర్ణయించామని వైద్యుల కొరత ఉన్న చోట ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. కాగా మెడికల్, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించి రోగులకు మెరుగైన సేవలు అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉన్నాయని వాటిని విడుదల చేయకుంటే.. సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయని, ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి నిధులు విడుదలకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని" హామీ ఇచ్చారు





Untitled Document
Advertisements