జగన్ కి మరోసారి సిట్ నుంచి నోటిసులు

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 04:17 PM

జగన్ కి మరోసారి సిట్ నుంచి నోటిసులు

అమరావతి, నవంబర్ 20: వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కోర్టు మరోసారి నోటీసులు పంపింది. గత రెండు రోజుల క్రితమే విశాఖ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాడికి సహకరించాలని కోరుతూ..కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలంటూ సిట్.. సోమవారం సాయంత్రం మల్లీ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయంలో హత్యయత్నం అనంతరం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం కోసం ప్రయత్నించినప్పటికీ జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంవతో పాటు… తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో జగన్ నుంచి సమాచారం సేకరించేందుకు మరోసారి నోటీసులు పంపారు. ఈ విషయమై ఇప్పటికే డీజీపీ స్పందిస్తూ… కేసుల విచారణ పూర్తి స్థాయిలో త్వరగా పూర్తవ్వాలంటే… జగన్ సహకరించాలని తెలిపారు.

ఈ దాడికి సంబంధించి రక్తపు మరకలున్న చొక్కాను కోర్టుకు సమర్పించాలంటూ జగన్‌కు సమన్లు జారీ అయ్యాయి. దాడి ఘటనలో కీలక సాక్ష్యమైన షర్ట్‌ (చొక్కా)ను నవంబర్ 23 ఉదయం 11 గంటలలోపు అందజేయాలని విశాఖ ఏడో మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జగన్‌ను ఆదేశించింది. ఇదే సమయంలో సిట్ నుంచి నోటీసులు సైతం రావడంతో వైకాపాలో తీవ్ర చర్చకొనసాగుతోంది.

Untitled Document
Advertisements