తెలంగాణ రాజకీయ శ్రీమంతులు

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 04:47 PM

తెలంగాణ రాజకీయ శ్రీమంతులు

హైదరాబాద్, నవంబర్ 20: ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు తమ అఫిడవిట్ వివరాలనుసమర్పించారు. అయితే అందరి వివరాలు పరిశీలించిన అనంతరం వందల కోట్ల ఆస్తులున్న శ్రీమంతుల జాబితాలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో వరుసగా నాగర్ కర్నూలు నియోజకవర్గ తెరాస అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, మంజీర కన్‌స్ట్రక్షన్స్ ఎండీ, శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి యోగానంద్, ఖమ్మం తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు నిలిచారు.

అభ్యర్థి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ, ఆస్తులు రూ.314,31,70,406

మర్రి జనార్దన్ రెడ్డి, తెరాస పార్టీ, ఆస్తులు రూ.161,27,26,168

కె.అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఆస్తులు రూ.151,13,99,281

యోగానంద్ , బీజేపీ పార్టీ, ఆస్తులు రూ.146,67,57,584

నామా నాగేశ్వరరావు, తెదేపా పార్టీ, ఆస్తులు రూ.110,01,80,475

ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే వారి దగ్గరే ఇంత డబ్బు ఉంటే..ఇక ఎంపీ స్థానాలకు పోటీ చేసే వారిలో ఎంత మంది శ్రీమంతులు ఉంటారో అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

Untitled Document
Advertisements