నూతన వంతెనను ప్రారంభించిన చంద్రబాబు

     Written by : smtv Desk | Thu, Nov 22, 2018, 11:32 AM

నూతన వంతెనను ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి, నవంబర్ 22: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కృష్ణా జిల్లాలో ఉల్లిపాలెం-భవానీపురం వంతెనను ఆయన ప్రారంభించించారు. బందరు-అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాలను కలుపుతూ ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రూ.77 కోట్లతో 20 గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. మచిలీపట్నం పోర్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. పోర్టు నిర్మాణానికి ప్రజలు, రైతులు సహకారాన్ని అందించాలని కోరారు. భూముల ధరలు పెరుగుతాయి కదా అని ఇంట్లో కూర్చుంటే అభివృద్ధి జరగదన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామన్నారు.

Untitled Document
Advertisements