అనంతపురం జిల్లాలో చంద్రబాబు

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 10:49 AM

అనంతపురం జిల్లాలో  చంద్రబాబు

విజయవాడ, నవంబర్ 23: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు,రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మారాల జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. అంతేకాక పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు. ఆ తర్వాత జిల్లా టిడిపి నేతలతో చంద్రబాబు కీలక సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు.

Untitled Document
Advertisements