రంగం లోకి మిచెల్‌ స్టార్క్‌

     Written by : smtv Desk | Sat, Nov 24, 2018, 01:00 PM

రంగం లోకి మిచెల్‌ స్టార్క్‌

సిడ్నీ, నవంబర్ 24: పర్యాటక భారత్ జట్టుతో టీ20 సిరీస్‌లో తలపడుతున్న ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్‌లోకి స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేశారు. శుక్రవారం వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బిల్లీ స్టాన్‌లేక్‌కు చీలమండ గాయం కావడంతో అతడు సిరీస్‌కు దూరమయ్యాడు దీంతో అతనికి బదులుగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు కౌల్టర్‌నైల్‌ను బరిలోకి దింపింది. అయితే సిరీస్‌ను ఫలితాన్ని నిర్ణయించనున్న చివరి టీ20కి కీలక బౌలర్‌ స్టార్క్‌ అందుబాటులో ఉంటాడని ఫించ్‌ పేర్కొన్నాడు. ఖఎంతో అనుభవం ఉన్న స్టార్క్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించగలడు. ఒక్కసారి లయ అందుకుంటే చాలు అతను సులభంగా ప్రత్యర్థిని కట్టడి చేయగలడుగ అని ఆసీస్‌ సారథి చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న స్టార్క్‌ ఈరోజు ఆసీస్‌ జట్టుతో కలిసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements