గుంటూరు లో ఘోర రోడ్డు ప్రమాదం

     Written by : smtv Desk | Sat, Nov 24, 2018, 01:25 PM

 గుంటూరు లో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు, నవంబర్ 24: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . కారు లారీని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. రాజమండ్రికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో శబరిమల వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా చిలకలూరిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

Untitled Document
Advertisements