జనసేనాని బస్సు ప్రయాణం

     Written by : smtv Desk | Sun, Nov 25, 2018, 01:50 PM

జనసేనాని బస్సు ప్రయాణం

రంపచోడవరం , నవంబర్ 25: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన రాజమహేంద్రవరం నుంచి బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.రంపచోడవరంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్వాసితులను వామపక్ష నేతలతో కలిసి పరామర్శించారు. గిరిజనులతో మమేకై అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్, ఇతర వామపక్ష నేతలు ఉన్నారు.

Untitled Document
Advertisements