బామ్మతో సూపర్ స్టార్ మహేష్ బాబు , ఫోటో వైరల్

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 11:43 AM

బామ్మతో సూపర్ స్టార్ మహేష్ బాబు , ఫోటో వైరల్

హైదరాబాద్, నవంబర్ 27: ఎప్పుడు అభిమానులు స్టార్స్ పై అభిమానం చూపడమే కాదు ఒక్కోసారి రిటర్న్ గిఫ్టులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టమైన స్టార్ హీరో నుండి ప్రత్యేకంగా కానుకలంటే సినిమాకు సంబందించినవే అనుకుంటారు కాని అంతకుమించి అంటే ఆ స్టార్ హీరోతో సెల్ఫీనే. ప్రస్తుతం మహేష్ తో 106 ఏళ్ల బామ్మ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి మహేష్ బాబుకి వీరాభిమాని. మహేష్ తో ఫోటో దిగాలని ఈమధ్య ఆమె కోరడం మీడియా కవర్ చేసింది. సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అయ్యింది. అయితే అప్పుడు అమెరికాలో మహర్షి షూటింగ్ లో ఉన్న మహేష్ హైదరాబాద్ చేరుకోగా మహర్షి సెట్స్ లో తన 106 ఏళ్ల అభిమానిని కలుసుకున్నారు. మహేష్ ను కలిసిన సత్యవతి భావోద్వేగం అవడం జరిగింది.

స్టార్ అయ్యినందుకు ఎంత అదృష్టవంతులో ఇలాంటి సందర్భాలు చూస్తేనే అర్ధమవుతుంది. మహేష్ రాజమండ్రి అభిమానుల సహాయంతో రేలంగి సత్యవతి మహేష్ ను కలవడం జరిగింది. అంతేకాదు ఆమెను రాజమండ్రి నుండి హైదరాబాద్ కు.. అక్కడి నుండి మళ్లీ ఇంటికి చేర్చే దాకా అభిమానులు తోడున్నట్టు తెలుస్తుంది.

Untitled Document
Advertisements