గీతా గోవిందం డైరక్టర్ కు ఇన్ని కష్టాలా

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 03:30 PM

 గీతా గోవిందం డైరక్టర్ కు ఇన్ని కష్టాలా

హైదరాబాద్, నవంబర్ 27: ఓ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడికి వెంటనే ఛాన్సులు రావడం చూస్తుంటాం కాని గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే పరశురాంకు అవకాశాలు లేకుండా పోయాయి. విచిత్రం ఏంటంటే అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు కాని అతని టేస్ట్ కు తగినట్టుగా హీరోలు మాత్రం దొరకడం లేదట. యువత నుండి గీతా గోవిందం వరకు ప్రతి సినిమాకు ప్రతిభ చాటుతూ వస్తున్న పరశురాం తన తర్వాత సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లోనే చేస్తాడని తెలుస్తుంది.

కథ కూడా ఫైనల్ చేశారట. కాని అందుకు తగిన హీరోల కోసం పాట్లు పడాల్సి వస్తుందట. అసలైతే మెగా హీరో సాయి ధరం తేజ్ తో పరశురాం సినిమా ఉంటుందని వార్తలు రాగా తేజూ రీసెంట్ గానే కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టాడు. ఎలాలేదన్నా ఆ సినిమా కోసం 6 నెలలు డేట్స్ ఇచ్చి ఉంటాడు. అందుకే తేజూ ప్లేస్ లో పరశురాం వేరే హీరో కోసం వేట మొదలు పెట్టాడట.

నిఖిల్, నాని ఇలా మీడియం రేంజ్ హీరోలకు పరశురాం పర్ఫెక్ట్ సినిమా అందిస్తాడు. మరి సాయి ధరం తేజ్ బదులు పరశురాం ఎవరితో తన తర్వాత సినిమా చేస్తాడో చూడాలి.

Untitled Document
Advertisements