వైరల్ గా మారిన సైనా నెహ్వాల్ పెళ్లి పత్రిక!

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 05:02 PM

వైరల్ గా మారిన సైనా నెహ్వాల్ పెళ్లి పత్రిక!

హైదరాబాద్, నవంబర్ 27:తన తోటి ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడో చిగురించినప్పటికీ.. రీసెంట్ గా వీళ్ల ప్రేమ వ్యవహారం బయట తెలిసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటి కావాలనుకున్నారు. దీంతో డిసెంబర్ 16న ఇరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే.. వీరి పెళ్లికి సంబంధించిన పత్రిక ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ఇన్విటేషన్ కార్డు తెగ హల్ చల్ చేస్తున్నది.

Untitled Document
Advertisements