యుగానికి ఒక్కడు సీక్వల్ వస్తోంది

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 06:00 PM

యుగానికి ఒక్కడు సీక్వల్ వస్తోంది

హైదరాబాద్, నవంబర్ 27: సెల్వ రాఘవన్ డైరక్షన్ లో కార్తి హీరోగా వచ్చిన క్రేజీ మూవీ ఆయిరత్తిల్ ఒరువన్. తెలుగులో యుగానికి ఒక్కడుగా రిలీజైంది. కార్తి మొదటి సినిమా కూడా అదే అవడం విశేషం. చేసింది తక్కువ సినిమాలే అయినా సెల్వ రాఘవన్ తనకంటూ ఓ మార్క్ వేసుకున్నాడు. ప్రస్తుతం సూర్యతో ఎన్.జి.కే సినిమా చేస్తున్న సెల్వ రాఘవ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో యుగానికి ఒక్కడు సీక్వల్ ప్లాన్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు.

ధనుష్ హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన పుదుపేట్టై సినిమా సీక్వల్ ఎప్పుడని ప్రేక్షకులు అడుగుతారని.. కాని తన మనసులో యుగానికి ఒక్కడు సీక్వల్ ఆలోచన ఉందని చెప్పారు సెల్వ రాఘవన్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరు ప్రయోగం చేస్తున్నారు కాని దాదాపు 10 ఏళ్ల క్రితమే గ్రాఫిక్స్ తో సెల్వ ప్రయోగాలు చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

మరి యుగానికి ఒక్కడు సినిమా సీక్వల్ వస్తే అందుకు తగిన కథ కూడా సెట్ అయితే మాత్రం కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ భారీ అంచనాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. సూర్య హీరోగా చేస్తున్న ఎన్.జి.కే మూవీ 2019 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

Untitled Document
Advertisements