కేజీఎఫ్ సినిమా పై శంకర్ కామెంట్

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 06:35 PM

కేజీఎఫ్  సినిమా పై శంకర్ కామెంట్

తెలుగు సినీ పరిశ్రమలో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారు. బాహుబలి సినిమాతో మన భారతీయ సినిమా స్థాయి పెంచిన ఆయనకి తెలుగులోనే కాదు యావత్ దేశం మొత్తం లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమాను గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా, అందరి దృష్టి ఆ సినిమాపైకి వెళుతుంది. అలాగే తమిళంలో భారీ ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా శంకర్ కి వొక రేంజ్ లో ఇమేజ్ వుంది. కథకు సాంకేతికతను జోడించి ఆసక్తికరంగా అందించడం ఆయన ప్రత్యేకత.

ఆయన కూడా ఏ సినిమాను గురించి మాట్లాడినా అక్కడి వాళ్లందరిలో చర్చ మొదలవుతుంది. ఇటీవల శంకర్ తాజా ఇంటర్వ్యూలో కన్నడ మూవీ కేజీఎఫ్ గురించి మాట్లాడటం విశేషం. ఉత్తరాది వాళ్లు కేజీఎఫ్ గురించి చర్చించుకోవడం నేను విన్నాను. కేజీఎఫ్ ట్రైలర్ చాలా బాగుందని వాళ్లు మాట్లాడుకోవడం నాకు సంతోషం కలిగించింది. సౌత్ సినిమాల స్థాయి పెరగడం .. భాషల హద్దులూ , పరిశ్రమల మధ్య అంతరాలు తగ్గిపోవడం మంచి పరిణామం " అనే భావాన్ని వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements