నాని ఖాతా లో 3 క్రేజీ సినిమాలు

     Written by : smtv Desk | Fri, Nov 30, 2018, 06:38 PM

నాని ఖాతా లో 3 క్రేజీ సినిమాలు

నవంబర్ 30 : పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ , ఇంటిల్లిపాదినీ అలరిస్తూ నేచురల్ స్టార్ గా ఎదిగిన నానికి ఈ ఏడాది అంతగా గా కలిసొచ్చినట్లు లేదు . తీసిన రెండు సినిమాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు కాస్త నిరాశ పరిచాయి . దాంతో ఇక చేయబోయే సినిమాల పట్ల కాస్త జాగ్రత్త పడుతున్నాడు . అంతే జాగ్రత్తతో స్పీడ్ కూడా పెంచాడు , ప్రస్తుతం హారిక హాసిని క్రియేషన్స్ లో జెర్సీ చేస్తూనే , విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకం లో ఒక సినిమాను ఫిక్స్ చేసాడు . అలాగే దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఇంత చురుగ్గా నడుస్తున్న షెడ్యూలులో ఇంకో క్రేజీ డైరెక్టర్ కు కుడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మొదటి సినిమాతో నే ఫ్రెష్ కామెడీ మరియు యాక్షన్ సీన్స్ల తో మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి డైరక్షన్ లో , కేఎస్ రామారావుకు ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. విక్రమ్ కుమార్ సినిమా తరువాత ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ క్రేజీ సినిమాలతో వసూల్లమోత మోగించిడానికి నాని సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతుంది .

Untitled Document
Advertisements