బుల్లితెరపై సత్తా చాటిన విజయ్ దేవరకొండ...!

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 06:20 PM

బుల్లితెరపై సత్తా చాటిన విజయ్ దేవరకొండ...!

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలుగు సినీ తెరపై ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ ప్రేమకథా చిత్రాలలో గీత గోవిందం ముందు ఉంటుంది. రౌడీ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా, 100 కోట్ల కలెక్ట్ చేసింది. ఈ చిత్రంతో విజయ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఈ సినిమాను మొదటిసారి జీ తెలుగు చానల్లో ప్రసారం చేసినప్పుడు 20.18 టీఆర్పీని సాధించింది. ఆ స్థాయి రేటింగ్ రావడం అంత ఆషామాషీ విషయం కాదు.

ఇక బుల్లితెరపై ఏ సినిమా అయినా రెండవసారి ప్రసారమైనప్పుడు రేటింగ్ విషయంలో భారీ తేడా కనిపిస్తూ ఉంటుంది. కానీ గీతగోవిందం విషయంలో అలా జరగలేదు. ఇటీవల జీ తెలుగు ఛానెల్ వారు రెండవసారి ఈ సినిమాను ప్రసారం చేసినప్పుడు 17.16 టీఆర్పీని రాబట్టింది. తొలిసారి సాధించిన రేటింగుకి .. రెండవసారి రాబట్టిన రేటింగుకి మధ్య చాలా తక్కువ తేడా ఉండటం విశేషం.

Untitled Document
Advertisements