ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ పుస్తకాలని ఆవిష్కరించిన ప్రధాని

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 04:37 PM

ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ పుస్తకాలని ఆవిష్కరించిన ప్రధాని

ముంబై, డిసెంబర్ 18: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ముంబైలో ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ వేసిన కార్టూన్లతో రూపొందించిన టైమ్‌లెస్ లక్ష్మణ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కార్టూన్లు మనసును ఇబ్బందిపెట్టవని, కానీ వాటికి ఆరోగ్యాన్ని నయం చేసే శక్తి ఉందని, గత అయిదు దశాబ్ధాల్లో వచ్చిన లక్ష్మణ్‌ కార్టూన్లపై సామాజిక రాజకీయ కోణంలో అధ్యయనం చేయాలని మోదీ సూచించారు. ఓ వర్సిటీ వీటిని పరిశీలిస్తే బెటర్ అని ఆయన అన్నారు. కామన్ మ్యాన్ క్యారికేచర్‌తో లక్ష్మణ్ చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, గవర్నర్ విద్యాసాగర్ రావులు కూడా పాల్గొన్నారు. లక్ష్మణ్ వేసిన కార్టూన్ల ఆధారంగా.. అధ్యయనం జరగాలని మోదీ అభిప్రాయపడ్డారు. సామాజిక శాస్త్రాన్ని లక్ష్మణ్ కార్టూన్లతో ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. లక్ష్మణ్‌ కార్టూన్లను డిజిటైజ్ చేసిన ఆయన కుటుంబసభ్యులకు మోదీ కంగ్రాట్స్ తెలిపారు. కార్టూన్లు దేవుళ్లకు సమీపంగా ఉంటాయని, మానవుల్లోని విభిన్న పార్శ్వాలను అతి సూక్ష్మంగా పరిశీలిస్తారన్నారు.





Untitled Document
Advertisements