ఫిలిప్పీన్స్ కు భూకంప హెచ్చరికలు

     Written by : smtv Desk | Sat, Dec 29, 2018, 08:43 PM

ఫిలిప్పీన్స్ కు భూకంప హెచ్చరికలు

ఫిలిప్పీన్స్, డిసెంబర్ 29: ఈ రోజు ఫిలిప్పీన్స్ లో ని మిందానావో ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. మిందానావో ద్వీపంలోని జనరల్ శాంటోస్ అనే నగరానికి 193కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తలెిపారు. భూకంప కేంద్రానికి 300కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

తీరప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఫిలప్పీన్స్ తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. ఇటీవల ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునామి సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.





Untitled Document
Advertisements