భారత అంధుల ఫుట్‌బాల్ సంఘానికి రూ.50వేల విరాళం

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 01:18 PM

భారత అంధుల ఫుట్‌బాల్ సంఘానికి రూ.50వేల విరాళం

అబుదాబి, జనవరి 9: క్రమశిక్షణ పాటించని జట్టు సభ్యులు చెల్లించిన చిన్నచిన్న జరిమానాలను ఉత్తమ కార్యానికి ఉపయోగించాలని భారత ఫుట్‌బాల్ జట్టు నిర్ణయించింది. గత కొన్నేండ్లుగా శిక్షణకు ఆసల్యంగా రావడం, నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్స్ తీసుకురావడం, టీమ్ జెర్సీ వాడకపోవడం వంటి చిన్న కారణాలకు స్వల్పమొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ జరిమానాల నుంచి రూ.50వేలను భారత అంధుల ఫుట్‌బాల్ సంఘానికి విరాళం ఇవ్వనున్నారు. ఆట నుంచి సంపాదించిన మొత్తాన్ని తిరిగి కొంత చెల్లించడం ముఖ్యమైనది. అంధులు ఉపయోగించే ఫుట్‌బాల్స్ ను దాదాపు 50 డాలర్లను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేం ఇస్తున్న విరాళం వారికి కొన్ని ఫుట్‌బాల్స్‌ను అందిస్తుంది అని భారత పుట్‌బాల్ జట్టు చీఫ్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ అన్నాడు. ఫుట్‌బాల్స్ కొనుగోలు చేసేందుకు 50వేలు ఇస్తున్నందుకు భారత ఫుట్‌బాల్ సభ్యులకు అంధుల ఫుట్‌బాల్ సంఘం డైరెక్టర్ సునీల్ జే మాథ్యూ కృతజ్ఞతలు తెలిపాడు.





Untitled Document
Advertisements