అమెజాన్‌ సీఈఓ ‘విడాకుల ఖరీదు’ ఎంతో తెలుసా?

     Written by : smtv Desk | Fri, Jan 11, 2019, 06:53 PM

అమెజాన్‌ సీఈఓ ‘విడాకుల ఖరీదు’ ఎంతో తెలుసా?

అమెరికా, జనవరి 11: అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ తన పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకున్నానంటూ వెల్లడించారు. ఓ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన కారణంగానే బెజోస్‌ తన భార్య నుంచి విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రపంచ కుబేరుడు తన భార్యకు భరణంగా భారీ మొత్తం చేల్లించనున్నాడు. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్‌ ప్రస్తుత సంపాదన 137 బిలియన్‌ డాలర్లని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. భరణం రూపంలో తన భార్యకు సుమారు 60-70 బిలియన్‌ డాలర్లు(రూ. 42,38,10,00,00,000- నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లించనున్నారట. దీంతో బెజోస్‌ సంపద సగానికి తగ్గనుంది. ఈ క్రమంలో విడాకుల అనంతరం... ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలవనున్నారట.

25 సంవత్సరాలు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్‌ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని బెజోస్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements