ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Thu, Feb 07, 2019, 03:50 PM

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ఉగ్రవాదులను అంతమొందించే తమ ఆశయం నెరవేరబోతుందని వ్యాఖ్యానించారు యూ ఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ను అంతం చేసేలా.. మరో వారంలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు ట్రంప్. వాషింగ్టన్ లో బుధవారం నాడు జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు తాజాగా ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా... అమెరికా, దాని మిత్ర దేశాలతో పాటు సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ కృషి కారణంగా.. ఐఎస్‌ పాలనలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందాయి. చాలా కష్టంతో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు ఆర్థిక, సైనిక సహకారాలు అందించి సిరియాకు అండగా నిలిచారు. ఇది సమిష్టి కృషి. ఐఎస్‌ ఉనికిని సమూలంగా రూపుమాపుతాం. ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా అధికారిక ప్రకటన చేస్తాను’ అని ట్రంప్‌ దిశానిర్దేశం చేసారు .





Untitled Document
Advertisements