సెల్పీ లవర్స్ కోసం వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు

     Written by : smtv Desk | Sat, Feb 09, 2019, 06:21 PM

సెల్పీ లవర్స్ కోసం వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 09:సెల్పీ లవర్స్ కోసం వివో సరికొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. భారీ సెల్ఫీ కెమెరాతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే మార్కెట్లో కనువిందు చేయనున్నాయి . వివో.. వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఈ నెల 20న భారత్‌లో విడుదల చేస్తోంది.

ఈ ఫోన్లలో 32 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్పీ కెమెరా, రియర్‌లో 48 ఎంపీతోపాటు ట్రిపుల్ కెమెరా దీని ప్రత్యేకత. మూడు బ్యాక్ కెమెరాలతో పాటు ఎల్ ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 48+8+5 మెగా‌పిక్సెల్రియర్ కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, దీని ధర సుమారు రూ.30 వేలు.

Untitled Document
Advertisements