ఫోటోలు తీసినందుకు 20 ఏళ్ల విద్యార్థిని జైల్లో పెట్టిన అమెరికా

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 08:35 AM

ఫోటోలు తీసినందుకు 20 ఏళ్ల  విద్యార్థిని జైల్లో పెట్టిన అమెరికా

బీజింగ్, ఫిబ్రవరి 11: "అమెరికాలో గూఢచర్యం చేయడానికి విద్యార్థులను ఉపయోగించుకుంటోంది చైనా" అంటూ ఇటివల కొన్ని వార్తలు తెర పైకి వచ్చాయి. అవి ఎంత వరకు వాస్తవమో తెలియదు కాని వీటిని ఎవరు సీరియస్‌గా తీసుకున్నా తీసుకోకపోయినా అమెరికా మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఎంతగా అంటే వారి మెరీన్ బేస్ చిత్రాలు తీసినందుకు ఓ చైనీస్ విద్యార్థిని వెంటనే అరెస్టు చేసేంతగా. ఆ విద్యార్థి మాత్రం తాను ఓ టూరిస్టునని, దారి తప్పి అక్కడకు వచ్చానని, సరే ఎలాగూ వచ్చాం కదా అని రెండు ఫొటోలు తీశానని చెప్పాడు.

అక్కడ చిత్రాలు తీయడం నేరమని తనకు తెలియదని, తనను వదిలేయాలని వేడుకున్నాడు. అయితే అక్కడి అధికారులు దీనికి ఒప్పుకోలేదు. లోపలికి రాకూడదు అని బోర్డు ఉన్నా కూడా ఆ విద్యార్థి లోపలకు వచ్చాడని, అంతేకాక అతని కెమెరాలో ఏ సందర్శనా స్థలానికి సంబంధించిన ఫొటోలూ లేవని ఆరోపించారు.

టూరిస్టు అయితే నేరుగా ఇక్కడికి ఎందుకొచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు దేశాల గొడవల్లో ఆ విద్యార్థి ఇరుక్కుపోయాడు. నార్త్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో మ్యూజికాలజీ చదువుతున్న అతను గతేడాది వేసవిలో విద్యార్థుల బదిలీలో భాగంగా అమెరికా వెళ్లాడు.

Untitled Document
Advertisements