ఈబీసీ 10% కోటాపై ఆర్‌.కృష్ణయ్య పిటిషన్ : కేంద్రానికి నోటీసులు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 03:29 PM

ఈబీసీ 10% కోటాపై ఆర్‌.కృష్ణయ్య పిటిషన్ : కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఇటీవల కేంద్రప్రభుత్వం అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ రిజర్వేషన్లపై పలువురు కోర్టుల్లో కేసు దాఖలు కూడా చేసారు. అయితే తాజాగా ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్‌.కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై ఈ నెల 26లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా అమలు చేస్తారో తెలిపాలని ఆర్‌.కృష్ణయ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో అగ్రవర్ణాల రిజర్వేషన్లపై వ్యాపారవేత్త తెహసిన్‌ పూనావాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పుడు ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై న్యాయస్థానం స్టే నిరాకరించింది కూడా. అలాగే ఈ బిల్ ను సవాల్‌ చేస్తూ మద్రాస్‌ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులలో పిటిషన్ లు దాఖలయ్యాయి. అయితే రిజర్వేషన్‌ అనేది పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని సామాజికంగా వెనుబడి ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు కల్పించారని పిటిషనర్ల వాదన.

Untitled Document
Advertisements