మళ్ళీ మోదియే ప్రధాని అవుతారు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Tue, Feb 12, 2019, 05:12 PM

మళ్ళీ మోదియే ప్రధాని అవుతారు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఒక పక్క విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న సమయంలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న పలువురు నేతలు మద్దతు తెలిపిన తరుణంలో మరో పక్క..........

జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకొస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపడతారని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

నితీశ్ కుమార్ ఎన్డీఏలో ఒక పెద్ద నేత, బీహార్ ని పదిహేనేళ్ల పాటు పాలించిన ఘనత ఉన్న నాయకుడు. అయితే, ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయన్ని ఊహించుకోలేమని బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా, నితీశ్ అభ్యర్థిత్వం సాధ్యపడకపోవచ్చని వ్యాఖ్యానించారు.

కాగా, గత సెప్టెంబరులో జేడీయూలో ప్రశాంత్ కిషోర్ చేరారు. ఇటీవలే శివసేన అధ్యక్షుడు ఉద్ధశ్ ఠాక్రేను ప్రశాంత్ కలిశారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో జేడీయూ- శివసేన మధ్య పొత్తులు ఉంటాయన్న పూకర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను ఖండించిన ఆయన, శివసేనకు తాను వ్యూహకర్తగా పని చేయడం అసాధ్యమని, ఒక పార్టీలో సభ్యుడిగా మరో పార్టీకి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements