సినీరంగంలోకి మెగా ఫామిలీ నుండి వచ్చిన వారి పరిస్తితి....!

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 05:37 PM

సినీరంగంలోకి మెగా ఫామిలీ  నుండి వచ్చిన వారి పరిస్తితి....!

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మెగా కాంపౌండ్ నుండి వస్తున్న హీరోల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇక హీరోయిన్ల విషయానికొస్తే నిహారిక ఒక్కతే హీరోయిన్ గా మెగా ఫ్యామిలీ నుండి వచ్చింది. కాగా ఆ ఫ్యామిలి నుండి ఈ మధ్య వస్తున్న వారంతా సినీరంగ ప్రవేశం చేస్తున్నారు కాని వారికి తగ్గట్టు ఒక్క హిట్టు కూడా పడట్లేదు. సాయి ధరంతేజ్ వచ్చిన మొదట్లో వరుస సినిమాలు చేస్తూ చేసిన వాటిలో ఒకటో రెండో హిట్ లు అందుకున్నాడు అంటే తప్ప సరైన హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు ఆ హీరోకి చాన్సులు కూడా తగ్గిపోయాయి.

ఇక అల్లు అర్జున్ తమ్ముడు, మెగా అల్లుడు అల్లు శిరీష్ ది కూడా అదే పరిస్తితి. కెరీర్ లో ఒక‌ట్రెండు హిట్లు ఉన్నా.. ఇటీవ‌ల స‌రైన విజ‌యం ద‌క్క‌క‌పోవ‌డంతో శిరీష్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. స్క్రిప్ట్ మాస్ట‌ర్లు చేతిలో ఉన్నా.. మార్కెటింగ్ కి ఎలాంటి డోఖా లేక‌పోయినా ఎందుక‌నో ఈ అల్లు హీరో స‌న్నివేశం అంత‌గా వెల‌గ‌లేదు. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం ఎబిసిడి ఎప్పుడు రిలీజ‌వుతుందో తెలియ‌ని స‌న్నివేశం నెల‌కొంది. ఫిబ్ర‌వ‌రి 8 నుంచి మార్చి 1కి, ఆ త‌ర్వాత మార్చి 22 కి ఈ చిత్రాన్ని వాయిదా వేయ‌డాన్ని బ‌ట్టి బిజినెస్ ప‌రంగానూ ఎలాంటి స‌న్నివేశం నెల‌కొందో అన్న చ‌ర్చ సాగుతోంది.

పోయిన ఏడాది చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ విజేత సినిమాతో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నాడు కాని అనుకున్న హిట్ కొట్టలేకపోయాడు. అలాగే తాజాగా సినీ రంగ ప్రవేశం చేసిన మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక హీరోయిన్ విషయానికొస్తే నిహారిక కొణిదెల ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ఈ మెగా బ్యూటీ కెరీర్ ప్ర‌స్తుతం డోలాయ‌మానంలో ఉందా? అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో కేవ‌లం ప్ర‌తిభ ఉంటే స‌రిపోతుందా? న‌ట‌వార‌స‌త్వం ఉంటే వెలిగిపోవ‌డం కుదురుతుందా? అంటే అస్స‌లు ఛాన్సే లేద‌ని ఈ స్టార్ కిడ్ ని చూస్తే అర్థ‌మ‌వుతోంది.

న‌టించిన రెండు మూడు సినిమాలు ఆశించిన ఫ‌లితాల్ని ఇవ్వ‌లేదు. టీవీ తెర‌పై ఓకే కానీ పెద్ద తెర స‌న్నివేశ‌మేంటి? అంటే ప్ర‌స్తుతం నిరూపించుకోవాల్సిన స‌న్నివేశం త‌న‌కు ఉంది. రంగుల ప్ర‌పంచంలో స‌క్సెస్ ఎలా వ‌స్తుంది? అన్న‌ది నిహారిక కు అంతుచిక్క‌ని ర‌హ‌స్యంలా ఉంది. అస‌లు ఎక్క‌డ ఉంది లోపం? అంటే .. ఎంచుకునే క‌థాంశం.. తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు.. ఆలోచ‌నా విధానం.. అభిరుచి .. టైమింగ్.. అదృష్టం.. కాంపిటీష‌న్.. ఇన్ని విష‌యాలు ఇక్క‌డ ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ కెరీర్ ని నిర్ణ‌యిస్తున్నాయి. దిశా నిర్ధేశ‌నం చేస్తున్నాయి.

ప్రస్తుతం నిహారిక న‌టించిన `సూర్య‌కాంతం` చిత్రానికి స‌రైన ప్రీరిలీజ్ బిజినెస్ సాగ‌క‌పోవ‌డం చూస్తుంటే, హిట్టు ప‌రిశ్ర‌మ‌లో హిట్టు సెంటిమెంటు ఎలా ప‌ని చేస్తోందో అర్థం చేసుకోవాలి. పోస్ట‌ర్లు, టీజ‌ర్ ద‌శ‌లో ఆక‌ట్టుకున్నా ఎందుక‌నో ఈ సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూనే ఉంది. ఈపాటికే రావాల్సిన ఈ చిత్రాన్ని.. మార్చి 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ బిజినెస్ పూర్త‌వ్వ‌లేదు. దీంతో నిర్వాణ సినిమాస్ సంస్థ సొంతంగానే రిలీజ్ చేసుకోవాల్సిన స‌న్నివేశం తలెత్తింద‌ట‌. ప్ర‌ణీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్టంట్ మాస్టర్ విజ‌య్ కుమారుడు రాహుల్ విజ‌య్‌ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఇదంతా చూస్తే మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తప్ప ఇప్పటివరకు ఎవ్వరూ స్టార్ ఇమేజ్ ను దక్కించుకోలేకపోయారు. వరుణ్ తేజ్ కూడా వరుస విజయాలతో దూసుకేల్తున్నాడు. తాజాగా వచ్చిన ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మికీ అనే సినిమా చేస్తున్నాడు.





Untitled Document
Advertisements