చిట్ ఫండ్ కంపెనీలపై కేంద్రం వేటు...నిషేదించడానికి బిల్లు ఆమోదం

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 03:06 PM

చిట్ ఫండ్ కంపెనీలపై కేంద్రం వేటు...నిషేదించడానికి బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: బుదవారం లోక్‌సభలో జరిగిన చివరి బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి పియూష్‌గోయల్‌ చిట్ ఫండ్ సంస్థలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్నచిన్న ఇన్వెస్టర్లు ఉమ్మడి చిట్ ఫండ్‌ స్కీంలలో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారని, ఇందుకోసం ఖచ్చితమైన నిబందనలను రూపొందించి అమలుచేయాలని, అనధికారిక చిట్‌ఫండ్‌ సంస్థలపై నిషేధం విధించే బిల్లును లోక్ సభలో ఆమోదించారు.

బడ్జెట్‌ సమావేశాలు చివరిరోజు లోక్‌సభలో ఆర్ధిక మంత్రి పియూష్‌గోయల్‌ క్రమబద్దీకరణలేని డిపాజిట్‌ పథకాల నిషేధ బిల్లు 2018ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమలులోనికి వస్తే నష్టపోయిన డిపాజిటర్లకు పరిహారం అందనుంది. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న పీయూష్ గోయల్ స్పందిస్తూ‘ఉమ్మడి చిట్‌ఫండ్‌ పథకాలు కేవలం చిన్న ఇన్వెస్టర్లను లక్ష్యంగాచేసుకునే పనిచేస్తున్నాయి. అక్రమ డిపాజిట్‌ స్కీమ్‌లపై 978 కేసులు నమోదయ్యాయి. వాటిలో 326 కేసులు పశ్చిమబెంగాల్‌లోనే ఉన్నాయి. కేవలం ఒక్క బెంగాల్‌లోనే మొత్తం స్కీమ్‌లలో మూడో వంతుకు పైగా ఉన్నాయి. వీటిని క్రమబద్దీకరించేందుకు ఒక నిర్దిష్టమైన చట్టం అవసరం అవుతుందని, అందుకోసమే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాం. కఠినమైన చట్టాల అమలు ద్వారా ఈ లొసుగులను అరికట్టవచ్చు. ఆర్ధికశాఖ స్థాయీ సంఘం సిఫారసులను ఈ బిల్లులో చేర్చి సవరణలు చేశాం’ అని అన్నారు.

బుధవారం మూజువానివోటుతో స్వల్ప చర్చ అనంతరం బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే అక్రమ డిపాజిట్‌ పథకాలను అరికట్టే వీలు కలుగుతుందని, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకు భద్రత కల్పించినట్లవుతుందని వెల్లడించారు. ఈ బిల్లును 2018 జులైలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు





Untitled Document
Advertisements