400 ఏళ్ల నాటి చెట్టు చోరీ...దొంగలకు జాగ్రత్తలు చెప్పిన యజమాని

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 08:48 PM

400 ఏళ్ల నాటి చెట్టు చోరీ...దొంగలకు జాగ్రత్తలు చెప్పిన యజమాని

జపాన్‌‌, ఫిబ్రవరి 14: జపాన్‌లో ఓ వింత దొంగతనం చోటు చేసుకుంది. దొంగతనానికి గురైంది సాదారణ వస్తువు కాదు 400 ఏళ్ల నాటి ఓ చెట్టు. చెట్టునెలా దొంగాలిస్తారు అను అనుకుంటున్నారా.....! పూర్తి వివరాల ప్రకారం జపాన్‌‌లో షింపాకు జూనిపర్ బోన్సాయ్ రకం మొక్కకు చాలా డిమాండ్ ఉంది. ఒక్క చెట్టు విలువే దాదాపు రూ.65 లక్షల పై మాటే. ఈ క్రమంలో టోక్యోకు చెందిన సీజీ ఇమురా, ఆయన భార్య తన పెరటిలోని ఏడు బోన్సాయ్ మొక్కలను ఎవరో అపహరించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దయ చేసి వాటిని తిరిగి ఇచ్చేయాలని వేడుకున్నారు, ఆ చెట్లు ఎంతో అపురూపమైనవని, డబ్బులతో వాటిని వెల కట్టేలేమని, తమ బాధను అర్ధం చేసుకుని వాటిని తిరిగి అప్పగించాలని ప్రాధేయపడ్డారు. అంతేకాకుండా తిరిగి తమకు ఇచ్చే దాకా మొక్కలను ఎలా సంరక్షించాలో కూడా వివరించారు.





Untitled Document
Advertisements