అంగరంగ వైభవంగా గంగాపూర్ జాతర...

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 07:35 PM

అంగరంగ వైభవంగా గంగాపూర్ జాతర...

రెబ్బన, ఫిబ్రవరి 19: కొమురంభీం జిల్లా రెబ్బన మండంలంలోని గంగాపూర్ గ్రామంలో జరిగే 'గంగాపూర్ జాతర' ఎంత పేరు గాంచిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గంగాపూర్‌ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ జాతరకు ఘన చరిత్రే ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు రెండో తిరుపతిగా చెప్పుకోవడంతో పాటు ఏటా మాగశుద్ధ పౌర్ణమి రోజు ఈ ఆలయంలో జరిగే రథోత్సవానికి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారు. చుట్టుపక్కలో ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఈ ఆలయ దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రతీ సంవత్సరం మూడు రోజులు వైభవంగా జరిగే ఈ జాతర చరిత్ర ఏంటంటే...

రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ పోలిమేరలో ఉన్న గుట్టపై శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దాదాపు 16వ శబ్ధతానికి ముందు గంగాపూర్ కు చెందిన విస్వబ్రహ్మణ కులానికి చెందిన పోతాజి నిర్మించినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది. పోతాజి చిన్నతనం నుంచి శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామిని భక్తితో కొలుస్తూ ప్రతీ ఏటా మాఘశుద్ధ పొర్ణమి రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి మొక్కులు సమర్పిస్తుండేవాడు. ఆ తర్వాత వయసు పెరగడంతో అతని ఆరోగ్యం క్షీణించడం, ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తిరుపతికి వెళ్ళలేక తీవ్రమైన వేదనకు గురయ్యేవాడంటా. ఓ రాత్రి వెంకటేశ్వర స్వామి పోతాజి కలలో కనిపించి నీలాంటి భక్తుల కోసం గంగాపూర్ పోలిమేర లోని గుట్టబాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ద పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పాడు. గంగాపూర్ ను ఆనుకొని ఊన్న వాగు సమీపంలో గుట్ట లోయలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి పంచనామాలు ఆయనకు దర్శనమిచ్చాయి. దీనీతో ఆయన అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. మొదటి గుహలో గోవింద రాజు విగ్రహం, స్వామి ఎడమ వైపు శివాలయం, దాని పక్కన శ్రీ హనుమాన్ విగ్రహం గరుడ విగ్రహాలు ఉన్నాయి. పోతాజి సమాది ఆలయం ముందు భాగంలో ఉంది. ఆయన మరణానంతరం గ్రామస్తులే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది ఈ జాతర యొక్క ఘన చరిత్ర. ఇక ఈ ఏడాది కూడా ఈ జాతర అంగరంగ వైభవంగా సాగుతూ గత రెండు రోజుల క్రితం ప్రారంభమై ఈ రోజు ముగిసింది.





Untitled Document
Advertisements