ఇదేం సినిమా...??

     Written by : smtv Desk | Thu, Aug 03, 2017, 02:37 PM

ఇదేం సినిమా...??

హైదరాబాద్, ఆగష్టు 3 : తమిళ దర్శకుడు ప్రసన్న అయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ జంటగా హిందీలో 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమాను తెరకెక్కిస్తున్నారట. గత ఏడాది టాలీవుడ్ లో వచ్చిన 'నరుడా డోనరుడా' చిత్రం ' విక్కీ డోనర్'గా బాలీవుడ్ లో రిలీజ్ అయినప్పుడు రేగిన దుమారం అంత ఇంత కాదు. తెలుగులోకి వచ్చేటప్పటికి మామూలైపోయింది. కానీ, బాలీవుడ్ లో విడుదలైనప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా 'చీ,థూ' అనేసారు అక్కడి జనం. దానికే రి యాక్షన్ అలా ఉంటే, ఇప్పుడు రాబోతున్న ‘శుభ్ మంగల్ సావధాన్’ అనే సినిమా మరో అడుగు ముందుకేసింది. అయితే తమిళ్ లో కాకుండా బాలీవుడ్ నే ఎంచుకున్నాడు ఈ దర్శకుడు.

ఎంతయినా సాంప్రదాయ వాదులైన తమిళులు ఇలాంటి సబ్జెక్ట్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఊహించి, బాలీవుడ్ అయితే సేఫ్ అనుకున్నాడేమో గానీ అక్కడే మొదలు పెట్టాడు. ఇంతకీ ఆ సబ్జెక్ట్ ఏమిటంటే. అన్ని సినిమాలలో లాగే ఈ చిత్రం లో కూడా హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు వీళ్ళ ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం జరుపుతారు. అప్పుడు వీరి ప్రేమాయణం కొనసాగుతుండగా హీరోకి అంగస్తంభన సమస్య ఉందనే విషయం హీరోయిన్ కి తెలుస్తుంది. అలాంటోడ్ని పెళ్ళి చేసుకుని ఏం సంతోషపడతావు అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా హీరోయిన్ నాకు ప్రేమ ముఖ్యం అంటూ ఆయన్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందట ఆ తరువాత ఏమవుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే.





Untitled Document
Advertisements