కోహ్లీ వల్లే ఈ సిరీస్ ను కోల్పోయాం!

     Written by : smtv Desk | Thu, Mar 14, 2019, 01:35 PM

కోహ్లీ వల్లే ఈ సిరీస్ ను కోల్పోయాం!

మార్చ్ 14: ఆసిస్ తో ఐదు వన్డేల సిరీస్ లో బాగంగా నిన్న జరిగిన చివరి వన్డేలో భారత్ పరాజయ పాలై ఆసిస్ సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని మాజీ క్రికెటర్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే టీం ఇండియా వన్డే సిరీస్ చేజార్చుకుందని అన్నారు. అంతేకాక సిరీస్‌ గెలవకముందే ప్రయోగాలు చేయడం భారత పరాజయానికి కారణమని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. సిరీస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్‌ చేజారిందన్నాడు. తొలి రెండు వన్డేలు గెలిచి ఆధిపత్యం కనబర్చిన భారత్‌.. మరో మ్యాచ్‌ గెలిచాక ప్రయోగాలు చేయాల్సిందన్నాడు. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్‌ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్‌లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Untitled Document
Advertisements