నిరుపేద రైతు మహిళకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ

     Written by : smtv Desk | Tue, Mar 19, 2019, 12:06 PM

నిరుపేద రైతు మహిళకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ

ఎన్నికల్లో 33 శాతం టికెట్లను మహిళలకు కేటాయించి దేశానికంతా ఆదర్శంగా నిలిచిన బీజేడీ అధినేత, ఒడిశా ముంఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుపేద రైతు మహిళకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.

ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న ప్రమీలా బిసోయ్‌ని అక్సా లోక్ సభ నియోజక వర్గం నుంచి బరిలోకి దింపారు. స్వయం స్వహాయక గ్రూపులో చురుగ్గా పనిచేస్తున్న ప్రమీల మహిళల బాగోగుల కోసం 20 ఏళ్లుగా కష్టపడుతోంది. ఆమె కొడుకు టీ అమ్ముతున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చినా.. ప్రజాసంక్షేమం కోసం తన వంతుగా ఆమె చేస్తున్న కృషి సీఎం దృష్టికి వచ్చింది. ఒడిశాలో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్నాయి.





Untitled Document
Advertisements