అలా చేస్తే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా : అమితాబ్

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 03:02 PM

అలా చేస్తే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా : అమితాబ్

ముంబై, ఆగస్ట్ 8 : బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తన పుట్టిన రోజు వేడుకలను ఎవరు నిర్వహించవద్దంటూ అభిమానులకు విన్నవించుకున్నారు. తన పుట్టిన రోజున కొంతమంది అభిమానులు హంగామా చేసి చాలా హైరానా పడుతుంటారు వాళ్ళందరికీ ఇదే నా విన్నపం. ఒకవేళ నా మాటను కాదని ఎవరైనా ఈ వేడుకలను నిర్వహిస్తే.. ఎవరికీ కనిపించకుండా, అసలు ఎవరు కనుక్కోలేని దూరమైనా ప్రాంతానికి వెళ్ళిపోతానంటూ హెచ్చరించారు. ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే దయచేసి విరమించుకొండంటూ సెలవిచ్చారు. కాగా అమితాబ్ అక్టోబర్ 11న తన 75 వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.





Untitled Document
Advertisements