యూనియన్ నుంచి వైదొలిగేందుకు సమయం కావాలి!

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 05:49 PM

యూనియన్ నుంచి వైదొలిగేందుకు సమయం కావాలి!

మార్చ్ 22: యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ సర్కార్ వైదొలగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ యూనియన్ నుంచి వైదొలిగేందుకు గడువు కోరింది బ్రిటన్ సర్కార్. జూన్ 30 వరకు సమయం కావాలంటూ ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్కు లేఖ రాసినట్లు తెలిపారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదన్నారామె. అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందన్నారు ప్రధాని. ఇక థెరిసా మే లేఖను ఈయూ సభ్య దేశాలు పరిశీలించనున్నాయి.





Untitled Document
Advertisements