సీఓటర్‌ సర్వే : నెం.1 సీఎం గా కేసీఆర్

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 08:14 PM

సీఓటర్‌ సర్వే : నెం.1 సీఎం గా కేసీఆర్

హైదరాబాద్, మార్చ్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఏఎన్‌ఎస్‌- సీ వోటర్ సర్వేలో టాప్ వన్ సీఎంగా నిలిచారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐఏఎన్‌ఎస్‌- సీ వోటర్ సర్వే చేసింది. ఇందులో కేసీఆర్ ది బెస్ట్ సీఎంగా సత్తా చాటారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన ముఖ్యమంత్రిగా రికార్డ్‌ సృష్టించారు. కేసీఆర్ పనితీరుపై 79.2 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తపరచడం విశేషం. ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి అగ్రస్థానంలో నిలవగా… రెండోస్థానం హిమాచల్ ప్రదేశ్ సీఎంకు దక్కింది. చంద్రబాబు పాలనపై ఏపీలోని 41.3 శాతం మందే సంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఈ లిస్టులో బాబు పాలనలో ఉన్న ఏపీ 14వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక 7.7 శాతంతో తమిళనాడు చిట్టచివర నిలిచింది. అద్భుతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఐఏఎన్‌ఎస్‌- సీ వోటర్ సర్వేలో అగ్రస్థానంలో నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వ ప్రతిభకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణను అగ్రపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని స్పష్టం చేస్తున్నారు.





Untitled Document
Advertisements