బిహార్ నుంచి ఎంపీగా పోటికి సిద్దం

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 05:54 PM

బిహార్ నుంచి ఎంపీగా పోటికి సిద్దం

న్యూడిల్లీ, మార్చ్ 24: రానున్న ఎన్నికల సందర్భంగా బిహార్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియ‌న్ మాజీ అధ్య‌క్షుడు కన్నయ్య కుమార్ సిద్దమయ్యారు. బెగుసరాయ్ స్థానం నుండి సిపిఐ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బిహార్‌లో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ(ఎంఎల్‌) మహాకూటమిపై మండిపడింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలో తమకు సీట్లను కేటాయించకుండా కొన్ని పార్టీలతో మాత్రమే పొత్తుపెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కన్నయ్య రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.అయితే పొత్తులో భాగంగా ఆ సీటును ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌కు కేటాయించారు. దీంతో సీపీఐ త‌ర‌ఫున క‌న్న‌య్య పోటీకి దిగుతున్నారు. బిహార్‌లో మహాకూటమిలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ)20, కాంగ్రెస్‌ పార్టీ9, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)5, హిందుస్థానీ అవామ్‌ మోర్చ(హెచ్‌ఏఎం)3, వికాసశీల్‌ ఇన్సాన్‌ పార్టీ3 స్థానాల్లో పోటీ చేయనున్న విష‌యం తెలిసిందే.

Untitled Document
Advertisements