హత్య ఎవరు చేయించారో అందరికీ అర్థమైంది .. చంద్రబాబు

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 06:58 PM

హత్య ఎవరు చేయించారో అందరికీ  అర్థమైంది .. చంద్రబాబు

గత కొన్ని రోజుల క్రితం జరిగిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఘటన రాజకీయ వర్గాల్లో ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలుసు.అయితే ఈ హత్య పై ఇప్పటికే పలు రకాల కోణాల్లో అనేక రకాల అనుమానాలు లేవనెత్తుతున్నాయి.ఈ హత్యను టీడీపీ చేయించిందని వైసీపీ,వైసీపీ చేయించిందని టీడీపీ ఇలా రెండు పార్టీలు ఒకరి మీద మరొకరు బురద జల్లుకుంటున్నారు.ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

ఈ రోజు కడప జిల్లాలో నిర్వహించినటువంటి మీటింగులో మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేయించారో అందరికీ అర్ధమయ్యిందని,ఉదయాన్నే గుండె పోటు అని వారి పత్రిక మరియు టీవీ అయిన సాక్షి పై సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆ రోజు తొమ్మిదిన్నర గంటల తర్వాత వైఎస్సార్ కుటుంబంలో విషాదం గుండె పోటుతో వివేకానందా రెడ్డి మృతి అని వారే చెప్పుకోవడం దారుణమని,అలాగే అదే సమయంలో వైసీపీ ఎంపీ ఒకాయన ముందే ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతా సర్దేసి బాత్రూంలో చనిపోయిన వివేకానంద రెడ్డిని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి మొత్తం రక్తపు మరకలు కడిగేసి చనిపోయిన దేహానికి వారి ఆస్పత్రి నుంచి వైద్యులను పిలిపించి కుట్లు వేయించి కట్టు కూడా కట్టించారని ఇదెంత దుర్మార్గమని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Untitled Document
Advertisements