జెట్ ఎయిర్‌వేస్ విమానం స్వాధీనం

     Written by : smtv Desk | Wed, Apr 10, 2019, 06:05 PM

జెట్ ఎయిర్‌వేస్ విమానం స్వాధీనం

రుణ ఉభిలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కు మరో షాక్ తగిలింది. అప్పులు చెల్లించలేదంటూ యూరోప్ కంపెనీ ఒకటి.. జెట్ కంపెనీకి చెందిన విమానాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ రోజు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ముంబైకి రావాల్సిన 9డబ్ల్యూ 321 విమానాన్ని ముహూర్తం చూసుకుని పట్టుకుంది. ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్ పోర్టులో ఈ విమానాన్ని ఆపేశారు. జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు మొత్తం 123 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 15 విమానాలను మాత్రమే నడుపుతోంది. చాలా విమానాలను కిరాయికి తీసుకున్న కంపెనీ వాటి అద్దెలు చెల్లించలేక చేతులెత్తేసింది. 16 వేల మంది సిబ్బందికి వాయిదాల్లో జీతాలు ఇస్తోంది. దీంతో కొందరు ఉద్యోగాలు మానేయగా, కొందరు పీఎంఓకు లేఖ రాశారు. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్… ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం కింద నడుస్తోంది.





Untitled Document
Advertisements