50 కోట్ల క్లబ్ లోకి చేరిన మజిలీ

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 11:14 AM

50 కోట్ల క్లబ్ లోకి చేరిన మజిలీ

హైదరాబాద్, ఏప్రిల్ 15: శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' చిత్రం, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు చూసి, 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

కొంతకాలంగా చైతూ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి ఈ సినిమాతో లభించడం విశేషం. చైతూ కెరియర్లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి .. 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా 'మజిలీ' నిలిచింది. ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాన్షకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Untitled Document
Advertisements