బజాజ్ 'పల్సర్ 125' కొత్త బైక్

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 12:32 PM

బజాజ్ 'పల్సర్ 125' కొత్త బైక్

బజాజ్ పల్సర్ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఈ బైక్ కు ఎ రేంజ్ లో పాపులారిటీ ఉందొ తెలిసిందే. అయితే కంపెనీ కూడా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంతోపాటు ప్రస్తుత మోడళ్లను లేటెస్ట్ ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 200 సీసీ విభాగంలో ఎన్ఎస్ 200, 150 సీసీ విభాగంలో పల్సర్ 150తో దుమ్ములేపుతున్న కంపెనీ ఇప్పుడు 125 సీసీ విభాగంపై కన్నేసింది. బజాజ్ 125 సీసీ బైక్ ను పల్సర్ ఎన్ఎస్125 పేరుతో కంపెనీ సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి తీసుకురావొచ్చనే అంచనాలున్నాయి. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.70,000 సమీపంలో ఉండొచ్చు. కంపెనీ పల్సర్ 135ఎల్ఎస్ స్థానంలో దీన్ని తీసుకురానుంది. ఈ కొత్త బైక్‌లో 124.45 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశముంది. ఇక ఫ్యూయెల్ ఇంజెక్షన్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుంది. బైక్ మాగ్జిమమ్ పవర్ 12 హెచ్‌పీ@8500 ఆర్‌పీఎం. బైక్ మాగ్జిమమ్ టార్క్ 11 ఎన్ఎం@6000 ఆర్‌పీఎం. బైక్‌లో ఐదు గేర్లుంటాయి. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ బైక్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఎడమవైపు అనలాగ్ టాకోమీటర్, కుడివైపు డిజిటల్ స్క్రీన్ కనిపిస్తాయి. బైక్ ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. చూడటానికి చాలా బాగుంది.





Untitled Document
Advertisements