‘నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి’ మంటల్లో ఏసుక్రీస్తు రూపం!!!

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 04:55 PM

‘నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి’ మంటల్లో ఏసుక్రీస్తు రూపం!!!

పారిస్ : పారిస్ లో 850 ఏళ్ళ పురాతనమైన ‘నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి’ అగ్ని ప్రమదంలో కాలి బూడిదైపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చిని మళ్ళీ పునర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ కూడ ప్రకటించారు. చర్చి పునరుద్ధరణకు కోట్లాది యూరోల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మరమ్మతుల కోసం చర్చిని ఆరేళ్ల పాటు మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చర్చితో అనుబంధం ఉన్న జనం భావోద్వేగంతో స్పందిస్తున్నారు. అయితే చర్చి తగలబడుతున్నప్పుడు తమకు ఏసు క్రీస్తు రూపాలు కనిపించాయని కొందరు చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. మంటల ఆకారంలోక్రీస్తు నిలబడ్డట్లున్న చిత్రం ఒకటి వైరల్ అవుతోంది. అలాగే మంటల్లో క్రీస్తు ముఖంలాంటి ఆకారం చక్కర్లు కొడుతోంది. అయితే మంటలు ఎక్కడ లేచినా ఏవో కొన్ని రూపాలు కనిపిస్తుంటాయని కొందరు అంటున్నారు.

Untitled Document
Advertisements