కోర్టు మెట్లెక్కిన ఇంటర్ బోర్డు అధికారులు

     Written by : smtv Desk | Tue, Apr 23, 2019, 06:13 PM

కోర్టు మెట్లెక్కిన ఇంటర్ బోర్డు అధికారులు

హైదరాబాద్: ఇంటర్ బోర్డు ఫలితాల వ్యవహారంలో చేసిన పనితీరుపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళవారం మధ్యాహ్నం న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు సెక్రటరీ అశోక్‌ కోర్టుకు హాజరయ్యారు. మార్కులలో తారుమారు తప్పిదాలకు ఇంటర్‌ బోర్డు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, పేర్కొంటూ బాలల హక్కుల సంఘం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, మరి కొంతమంది పాస్‌ కాకపోవడంతో విద్యార్ధులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం..దానికి సంబంధించి బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. బోర్డు నిర్లక్ష్యం వల్లే 16 మంది విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం తమ పిటిషన్‌లో పేర్కొంది.





Untitled Document
Advertisements