వివి వినాయక్ హీరోగా రాబోతున్న సినిమాపై మరింత సమాచారం

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:06 PM

వివి వినాయక్  హీరోగా రాబోతున్న సినిమాపై మరింత సమాచారం

దర్శకుడు వివి వినాయక్ ప్రేక్షకులని సప్రైజ్ చేశాడు. ఆయన హీరోగా సినిమా రాబోతున్న విషయం షాకింగ్ న్యూస్. ఇప్పుడీ సినిమా గురించి మరింత సమాచారమ్ తెలిసింది. గతంలో శంకర్ దగ్గర శిష్యరికం చేసిన ‘శరభ’ దర్శకుడు ఎన్. నరసింహారావు చెప్పిన కథ దిల్ రాజుకు నచ్చడంతో, అతణ్ణి వినాయక్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకూ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమా కథ 1980 నేపథ్యంలో సాగుతుంది. తన వయసుకు తగ్గ పాత్రలో రెట్రో కథానాయకుడిగా వివి వినాయక్ కనిపిస్తారు. ప్రస్తుతానికి కథా చర్చలు మాత్రమే జరిగాయి. షూటింగ్ స్టార్ట్ కావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుందట. ఈలోపు వినాయక్ కాస్త బరువు తగ్గాలని అనుకుంటున్నారు. ఈ మాస్ దర్శకుడు హీరోగా హిట్ కొడతాడేమో చూడాలి.

Untitled Document
Advertisements